Mahaa Daily Exclusive

  సింగరేణి మండల పదిలో నూరు శాతం…

Share

  • సింగరేణి మండల పదిలో నూరు శాతం
  • మోనార్టీ గురుకుల విద్యార్ధికి 564 మార్కులు

కారేపల్లి, మహా : సింగరేణి మండల విద్యార్ధులు పది ఫలితాలలో నూరుశాతం ఫలితాలు సాధించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాలలో 14 ప్రభుత్వ, 2 ప్రయివేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు అందరు ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో దుగ్గిరాల జయరాజు తెలిపారు. పది పరీక్షలకు 581 మంది విద్యార్ధులు హాజరుకాగా అందరు ఉత్తర్ణత సాధించారు. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యార్ధిని ఎండీ.షబానా సుల్తానా 564 మార్కులు సాధించి మండల పస్ట్‌గా నిలవగా మోడల్ స్కూల్ విద్యార్ధి మందల మీనాక్షి 561, మైనార్టీ గురుకుల విద్యార్ధులు వాంకుడోత్ మోహిత 561 మార్కులు సాధించి రెండో స్ధానంలో నిలిచారు. తర్వాత స్ధానాలలో మోడల్ స్కూల్‌కు చెందిన వలివేటి వీరవెంకట సృజన 560, పొనుగోటి బిందు ప్రియ 558, చింత సుస్మిత 558 నిలిచారు. కేజీబీవీ విద్యార్ధిని పొన్నాడ హాసిని 556 మార్కులు సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను ఎంఈవో జయరాజు అభినందించారు.

Latest