Mahaa Daily Exclusive

  క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం-సర్పంచ్ దండు ప్రవీణ్

Share

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం-సర్పంచ్ దండు ప్రవీణ్

కారేపల్లి, మహా:క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం,మానసిక ఆరోగ్యం సాధ్యపడుతుందని అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్ అన్నారు.విద్యార్ధులు సెలవుల అనంతరం ఇండ్ల వద్ద ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.99 రోజుల ప్రజాపాలనలో ముగింపు కార్యక్రమంలో భాగంగా అప్పాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సావిత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులను అందజేశారు.ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా స్లాష్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ -2026 కార్యక్రమాన్నిఏప్రిల్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు మైనార్టీ స్కూల్ నందు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు మైనార్టీ పాఠశాలలోని 139 విద్యార్ధులు సమ్మర్ క్యాంపులో పాల్గొని కబడ్డీ,ఖోఖో,వాలీబాల్, ఫుట్ బాల్,షటిల్,అథ్లెటిక్స్,ఆటలను నేర్చుకున్నారు.ఆయా పాఠశాలల పిఈటిలు,పిఈడీలు విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలను,మెలకువలు,ఆటతీరుపై తర్ఫీదును ఇచ్చి పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సావిత్రి, ఆర్.ఎల్.సి అరుణకుమారి,విజిలెన్స్ టీం సీతారామారావు,పంచాయితీ కార్యదర్శి కృష్ణవేణి,వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.