Mahaa Daily Exclusive

  ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల

Share

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ జరిగింది.

ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెంకు చెందిన బుల్లిశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై, ముందుగా స్వామి మరియు అమ్మవార్లను దర్శించుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.

అలాగే దేవాలయ ధర్మకర్తలు, అధికారులు, కోటమీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తూర్పు వైపున అన్నివెట్టి మండపం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడింది. వేదమంత్రాల నడుమ కొత్తగా నియమితులైన సభ్యులు తమ బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.