కారేపల్లి, మహా: కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా శుక్రవారం కారేపల్లిలో సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు కర్షకులు ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు మేడే జెండాను ఎగురవేశారు. ర్యాలీ లో పాలకుల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నివసిస్తూ నినదించారు. రైల్వే స్టేషన్ బజార్లో హమాలి వర్కర్స్ యూనియన్, బస్టాండ్ సెంటర్లో సీపీఎం, సినిమా హాల్ సెంటర్లో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అంబేద్కర్ సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిపారు ఈ సందర్భంగా కార్మిక చట్టాలు, ఉపాధి హామీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పోరాటాలతోనే కార్మిక హక్కులు కాపాడుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అనేక గ్రామాలలో పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరావు సిఐటియు మండల కన్వీనర్ కే. నరేంద్ర, ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కే.ఉమావతి, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కే లోతు రవి, చిత్తూలూరి వీరయ్య, ముక్క సీతారాములు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు హుస్సేన్, ఆదెర్ల గౌతమ్, కొమరయ్య, సిపిఎం నాయకులు తలారి దేవ ప్రకాష్, అన్నారపు కృష్ణ, పాసిన్ని నాగేశ్వరావు, బందేలి తదితరులు పాల్గొన్నారు.







