- పోచారంలో కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం
- స్వామివారి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి
- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ గ్రామాల భక్తులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పోచారం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన, శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, పోచారం, కర్ణంగూడ గ్రామాల సరిహద్దులో నెలకొన్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని, పోచారం గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ దాయి నరేష్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులు పొందిన అనంతరం కళ్యాణంలో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వామివారి ఆశీస్సులతో ఇరు గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆశించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూములను పరిరక్షిస్తామని, దేవాలయం సమీపంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ప్రజలకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాగా తొర్రూరు గ్రామంలోని దేవాలయాన్ని సొంత నిధులతో నిర్మిస్తున్నామని తెలిపారు.
పోచారం గ్రామం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కళ్యాణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసి శేఖర్గౌడ్ మామ, మాజీ జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్, కర్ణంగూడ సర్పంచ్ వంగేటి తిరుమల్ రెడ్డి, ఏసిపి కెపివి రాజు, సిఐలు సత్యనారాయణ, మధు,ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం (రామారావు), పోచారం గ్రామం ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు గొరిగే రమేష్, మనసంత సురేష్, నాయకులు తాళ్ళపల్లి చిన్న, భగీరథ, అర్జున్ గౌడ్, కాటం కిషోర్ గౌడ్, గోదాసు శ్రీను, జంగయ్య, చింతాకు రవి గౌడ్, నల్లబోలు లావణ్య పాండురంగ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పులకంటి వెంకటరామిరెడ్డి పాండురంగ రెడ్డి, పంది సుశీలమహేందర్, కాటం కృష్ణ గౌడ్, నాయకులు కాటం శ్రీనివాస్ గౌడ్ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







