ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించినందుకు సీఎం కి ధన్యవాదాలు తెలిపిన కార్మిక సంఘాల నేతలు.
కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యే లు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాలు..
1. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్
2.ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్( ఆర్)
3. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్
4. టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
5.టీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్
7.టీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్
8.టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ యూనియన్
9.తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్
10.తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్
11.టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్
12.టీఎస్‌ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్
13.టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్
14.తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్
ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి గారు..
సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించడానికి కార్యచరణ కోసం ముందుకు వచ్చినందుకు అభినందనలు.
నేను వేరు, మీరు వేరు అన్న భావన నాకు ఎప్పుడు లేదు..
అందరం కలిస్తేనే ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు..
ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నాం..
ఆర్టీసీలో బస్సులను పెంచాం, నియామకాలు పెంచాం, ఆదాయం పెంచాం..
ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా నిలిచింది..
గాజులరామారంలో బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించాం..
శంషాబాద్ లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మిస్తాం..
1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రో తో అనుసంధానం చేస్తున్నాం..
మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలనుకుంటున్నాం..
డీజీల్ పైన ఆర్టీసీ ప్రతి యేడాది 2000 కోట్లు ఖర్చు చేస్తుంది..
డీజీల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ బస్సులను తీసుకురావాలి..
ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాలి.. దీని కోసం పక్కా ప్రణాళిక కావాలి..
ఆర్టీసీ లో బకాయిలు మా హయాంలో పెట్టినవి కావు.. కాని వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం
పెండింగ్ లో కారుణ్య నియామాలను మేం చెపట్టాం..
ఆర్టీసీ సమస్యలు ఏవైనా నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించాను..
యూనియన్లు ,విలీనం లాంటి అంశాలపైన ప్రణాళిక బద్దంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం చెప్పాలి..
ఆర్థిక అంశాలతో కూడా పీఆర్సీ లాంటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది..
శాశ్వత పరిష్కారం కోసం చర్చించుకుని ప్రభుత్వం ముందు ఆప్షన్స్ పెట్టాలి..
రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుంది..
ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం..
సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహకరించాలి..
ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ ను కూడా తగ్గించం..
డీజీల్ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సును ప్రోత్సహిస్తున్నాం..
మహాలక్ష్మీ పథకం పెట్టడం ద్వారా 8 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ఇచ్చాం..
ఆర్టీసీ ని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉంది..
కార్మికులు,డిపో మేనేజర్ల మధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలి..
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం..
ఈ సారి ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిలు విడుదల చేశాం..
ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తాం.. కార్మికులతో ప్రభుత్వం ఉంటుంది..
సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లే.. సంస్థకు నష్టం జరిగే పనులు చేయోద్దు
కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య స్నేహా పూర్వక వాతావరణం ఉండాలి..
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుంది..







