- కరీంనగర్‌లో గులాబీ వర్సెస్ కమలం
- గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం
- ఎదురుదాడికి దిగిన బీజేపీ శ్రేణులు
- కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
- ఎమ్మెల్యే పాడి అరెస్ట్
కరీంనగర్, మహా : బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గత కొంత కాలంగా మొదలైన డైలాగ్ వార్ గురువారం హింసాత్మకంగా మారింది. దీంతో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్కు రావాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. తంబాకుతో కలిపి బండి సంజయ్ డ్రగ్స్ తీసుకుంటారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశఁలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్తలు సీరియస్ గా తీసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం కాగా కార్యాలయంలోని ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. బీజేపీ శ్రేణుల దాడుల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
గంగుల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. “బండి సంజయ్ తంబాకుతో పాటు డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారు, ఆ అలవాటు వల్లే ఆయన తలపై వెంట్రుకలు ఊడిపోయాయి,” అని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితోనే ఆగకుండా డ్రగ్స్ పరీక్షలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే బండి సంజయ్ కూడా పరీక్షలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. బండి సంజయ్‌పై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గంగుల కమలాకర్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంపైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు లోపలికి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయం బయట ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు.
సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గొడవకు కారణమైన పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే పాడి అరెస్ట్
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంగుల క్యాంపు కార్యాలయంలోనే ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనం ఎక్కే క్రమంలో కౌశిక్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తనపై రౌడీషీటర్లతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేయించారని ఆరోపించారు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని కేవలం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దాడిని ఖండించిన బీఆర్ఎస్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని, క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు, కారు ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్, ప్రతినిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు ఉసిగొల్పడం బాధాకరమన్నారు. “బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు బీఆర్ఎస్ అగ్ర నాయకులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడినా పోలీసులు ఏమాత్రం స్పందించకపోవడం, కేసులు పెట్టకపోవడం శోచనీయం. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసు, కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు అడ్డుకోలేదు. ఇలాంటి దాడులకు మేం భయపడం. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటాం” అని స్పష్టం చేశారు.








