Mahaa Daily Exclusive

  లింగం బంజర లో ఆంజనేయస్వామి ధ్వజ ప్రతిష్ట మహోత్సవం …

Share

 

కారేపల్లి, మహా:మండల పరిధిలోని లింగం బంజర గ్రామంలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నూతన జీవద్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో జీవద్వజ స్తంభం, నూతనంగా నిర్మాణం చేసిన గంగమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టించనున్న గంగమ్మ తల్లి విగ్రహలను లింగం బంజర, రామలింగాలపల్లి గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ముందుకొచ్చిన ధ్వజస్తంభం, గంగమ్మ తల్లి విగ్రహాలకు వాహనాల ముందు బిందెలతో నీళ్లు పోసి పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ప్రతిష్ట కార్యక్రమం రోజు ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ కర్మణా పుణ్య వాచనములు, 8 గంటల 40 నిమిషాలకు యంత్ర, విగ్రహం ప్రతిష్ట 11 గంటలకు పూర్ణాహుతి మండవ ఉద్వాసనలు, ఆశీర్వచనములతో కార్యక్రమాలు ముగుస్తాయని అనంతరం ఆదరణ భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారని తెలిపారు. విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాలకు విశేషంగా హాజరై తీర్థప్రసాదాలను స్వీకరించి అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు . ఈ కార్యక్రమాలన్నీ అర్చకులు అచ్యుత రామారావు శర్మ నేతృత్వంలో జరుగుతున్నాయని తెలిపారు.