Mahaa Daily Exclusive

  రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్దర్శులుగా యశ్వంత్ శ్రీనివాస్ రావు ఎన్నిక

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీఎన్జీవో) రంగారెడ్డి జిల్లా కమిటీ ఎన్నికలు నాంపల్లిలోని రాష్ట్ర టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేన్ ఆదేశాల మేరకు జరిగిన, ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడిగా ఊటు యశ్వంత్ (రెవెన్యూ శాఖ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మాధవ్ గౌడ్ (హెచ్‌డబ్ల్యూఓ), వైస్ ప్రెసిడెంట్లుగా రంగయ్య (అగ్రికల్చర్), అంజాత్ అలీ (వైద్య శాఖ), రాజశేఖర్ (రెవెన్యూ), వాణి (ప్రణాళిక శాఖ) ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రావు (మెడికల్ శాఖ) బాధ్యతలు స్వీకరించగా, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాస్, గాయత్రి, కార్తీక్, అమృత ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా ఆనంద్ సింగ్ (రెవెన్యూ శాఖ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్, పబ్లిక్ సెక్రటరీగా శివ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా మల్లేష్ గౌడ్, నసీరుద్దీన్, వెంకటరెడ్డి, విజిత, శేఖర్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఊటు యశ్వంత్ మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, టీఎన్జీవో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. సంఘంపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర నాయకత్వం కూడా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సమిష్టిగా పని చేయాలని సూచించింది. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు.