Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది

Share

  • ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం జరగాలి
  • పార్టీ జెండా మోసిన వారిని నాయకత్వం గుర్తిస్తుంది
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్

కారేపల్లి, మహా: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై పార్టీ కార్యకర్త లు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న వారంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. గత పాలకులు విస్మరించిన పేదింటికలను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం తీరుస్తున్నధని, మొదటి విడత మంజూరైన ఇళ్లన్నీ గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని పేదలు కట్టుకున్న ఆ ఇళ్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రెండో విడత కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, అర్హులైన పేదలందరికీ దశలవారీ గా ఇందిరమ్మ ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి రైతులకు మేలుచేసే కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని, మహిళలకు ఉచిత బస్సు పథకంతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తూ మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లను మంజూరు చేయడంతో పాటు వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తూ పేదలందరూ సన్న బియ్యం తో భోజనం చేసేలా చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్ధ విధానంతో నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ రద్దు చేసి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు.