- వేసవిలో వడదెబ్బ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో విజయలక్ష్మి
- ఇబ్రహీంపట్నం డివిజన్లో ర్యాలీ నిర్వహించారు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
వేసవిలో వడదెబ్బ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో విజయలక్ష్మి ప్రజలకు సూచించారు. ముందుగా వడదెబ్బ నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, డిఎంహెచ్వో విజయలక్ష్మి, ఇబ్రహీంపట్నం డివిజన్ సిహెచ్ఓ రామయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఎండలో పనిచేసే, ఇటుక బట్టి కార్మికులకు, ఉపాధి హామీ కూలీలకు, వడదెబ్బ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో విజయలక్ష్మి ప్రజలకు సూచించారు. బైక్ మీద తిరిగే గిగ్ వర్కర్లకు, పశువుల కాపరులకు, భవన నిర్మాణ కార్మికులు, బయట పనిచేసే ప్రజలు ఓ.ఆర్.ఎస్. ద్రావణం అందుబాటులో ఉంచుకోవాలి. మజ్జిగ, రాగి జావ, నిమ్మరసం త్రాగాలని, దాహం వేయకుండా మధ్యమధ్యలో నీలు తాగాలని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు తేలికపాటి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించి, తల, మొహాన్ని కప్పుకోండి, గొడుగు, క్యాప్, టోపీ వాడడం అలవాటు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు.








