Mahaa Daily Exclusive

  కలెక్టరును కలిసిన టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

జిల్లా కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసిన టిఎన్జీవో నూతన కమిటీ సభ్యులు యశ్వంత్, శ్రీనివాసరావు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డిని, నూతనగా ఎన్నికైన టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఊటు యశ్వంత్, కార్యదర్శి శ్రీనివాస్ రావుతో పాటు నూతన కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో నేతలను కలెక్టర్ అభినందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రావు, వైస్ ప్రెసిడెంట్ రంగయ్య, కే. శశ్రీనివాస్, నేతలు గాయత్రి ,వాణి, సమంత, ఎండి గౌస్, వెంకటేష్, శివతేజ, శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.