కారేపల్లి, మహా : బీజేపీ పాలన ప్రజలపై భారాలు, ప్రజల మధ్య విద్వేషాలు పెంచటం తప్ప దేశానికి చేసింది శూన్యమని సింగరేణి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్ విమర్శించారు. శనివారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తప్పు నిర్ణయాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వాయిదాల పద్దతిలో పెంచటానికి మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇప్పటికే రూ.3.50 భారం వేసిన మోడీ రానున్న రోజుల్లో మరింత పెంచటానికి సిద్ధమవుతోందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతోనే ప్రజల నుంచి వసూళ్లు దందా ప్రారంభించిందని ఆరోపించారు. సామాన్య ప్రజలకు భారంగా మారే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ చూఎస్త్రdశ్రీ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దారావత్ భద్రునాయక్, గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








