కారేపల్లి, మహా : సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) ఆధ్వర్యంలో కారేపల్లిలో శనివారం చిన్నారులకు కరాటే శిక్షణ ను ప్రారంభమైనాయి. శిక్షణను సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు,యువతలో ఆత్మరక్షణ, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన బాలబాలికలు, యువతకు ఈ శిక్షణ ప్రారంభించటం జరిగిందన్నారు. కరాటేతో పిల్లలలో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. శిక్షణ అనంతరం పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పండ్లు పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రావుల రాజశేఖర్, సరోజ, మేకల కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 173








