Mahaa Daily Exclusive

  ఆదిభట్ల డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి…

Share

  • ఆదిభట్ల డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి
  • ఆదిభట్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రజనీకాంత్ గౌడ్
    ఈ సి శేఖర్ గౌడ్ మామకు కృతజ్ఞతలు….

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఎమ్మెల్యే మల్ రెడ్డి సహకారంతో ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులుగా రజనీకాంత్ గౌడ్ ను నియమించడం జరిగింది, ఈ సందర్భంగా తనను ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులుగా నియమించినందుకు ఎమ్మెల్యే రంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సి శేఖర్ గౌడ్ మామకు కృతజ్ఞతలు….
అనునిత్యం సహకరిస్తూ, తన వెంట నీడలా ఉంటూ, ప్రతి పనిలో తోడుగా ఉంటూ, వెన్న అంటూ ఉంటూ ప్రోత్సహించిన నాయకుడు, మాజీ సర్పంచ్ ఈసి శేఖర్ గౌడ్ మామ, శనివారం ఆయనను కలిసి డివిజన్ అధ్యక్ష నియామకంలో పూర్తి సహకారం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తోటి సహచరులతో కలిసి, శాలువాతో సన్మానించడం జరిగిందని ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులు రజనీకాంత్ గౌడ్ తెలిపారు. రజనీకాంత్ గౌడ్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఆదిభట్ల డివిజన్ అధ్యక్షులుగా నియమించినందుకు, నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పనిచేస్తూ, కార్యకర్తలతో సమన్వయం పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో కార్పొరేటర్ల గెలుపుకు, మునుముందు జరిగే ప్రతి ఎన్నికలలో తన వంతు కృషి ఉంటుందని, పేద ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తానని రజినీకాంత్ గౌడ్ అన్నారు.