Mahaa Daily Exclusive

  రాష్ట్ర స్థాయి హిస్టరీ బుక్ కమిటీలో లెక్చరర్ తమ్మిశెట్టి  ….

Share

 

  • రాష్ట్ర స్థాయి హిస్టరీ బుక్ కమిటీలో లెక్చరర్ తమ్మిశెట్టి
  •   కారేపల్లి కాలేజీ హిస్టరీ లెక్చరర్ కు దక్కిన గౌరవం

 

కారేపల్లి, మహా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల

చరిత్ర అధ్యాపకులు

తమ్మిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రస్థాయి హిస్టరీ టెక్స్ట్ బుక్ కమిటీ లో సెలెక్ట్ అయ్యారు. కమిటీలో 9 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా తమ్మిశెట్టి శ్రీనివాస్ ఒక్కరే కమిటీలో ఏకైక అధ్యాపకులు. ఐదేళ్లపాటు ఉండే ఈ కమిటీలో గత ఐదేళ్ల కాలం కమిటీలో కూడా ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్ హిస్టరీ బుక్ లో 12 వ లెసన్ జాతీయోద్యమం లెక్చరర్ శ్రీనివాస్ రాసిందే.దీంతో పాటు సిలబస్ కమిటీలో కూడా హిస్టరీ అధ్యాపకునికి స్థానం లభించింది. ఈ సందర్భంగా తమ్మిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా ప్రతిభను గుర్తించి రాష్ట్రస్థాయి హిస్టరీ బుక్ కమిటీలో అవకాశం కల్పించిన గత ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య, ప్రస్తుత కమిషనర్ అభిలాష్ అభినవ్, తెలుగు అకాడమీ డైరెక్టర్ వెంకటేశం కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కమిటీ లో కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ హిస్టరీ లెక్చరర్ ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు

హర్షం వ్యక్తం చేశారు.