Mahaa Daily Exclusive

  వర్షాకాలం ముందస్తు చర్యలు తీసుకోవాలి…

Share

  • వర్షాకాలం ముందస్తు చర్యలు తీసుకోవాలి
  • సమీక్షాసమావేశంలో తహసీల్ధార్, ఎంపీడీవో

కారేపల్లి, మహా : వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్ధాయిలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. సోమవారం సింగరేణి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్నిశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో తహసీల్ధార్, ఎంపీడీవో లు మాట్లాడుతూ గత ఏడాది వర్షా కాలంలో నీటి ముంపు కు గురై నీరు రోడ్లపై, లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రవహించటం,అండర్గ్రౌండ్ బ్రిడ్జి వంటివి 14 ప్రాంతాలను గుర్తించటం జరిగిందన్నారు. పాడుబడ్డ ఇండ్లను గుర్తించి ఆ ఆవాసాలలో ఉండకుండా చైతన్యం తేసి వారిని రీహాబిటేషన్ సెంటర్ కు తరలించాలని కోరారు. వర్షాకాలంలో కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్స్, 11 కేవీ లైన్ల కు దూరంగా ఉండేలా గ్రామస్తులకు సూచనలు చేయాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్రపరిచి ప్రతి ట్యాంక్లో క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్ కు బ్లీచింగ్, సున్నం ప్రతి గ్రామపంచాయితీలో స్టాక్ ఉండాలని కార్యదర్శులను కోరారు. ఈసమావేశంలో పీఆర్ ఏఈ రాజశేఖర్, ఆర్‌బ్ల్యూఎస్ ఏఈ నరేందర్ రావు, ఐబీ ఏఈ నాగయ్య, హౌసింగ్ ఏఈ నాగేంద్రబాబు, ట్రాన్స్‌కో ఏఈ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.