Mahaa Daily Exclusive

  అమెరికాలో కారు ప్రమాదం – మధుయాష్కీ గౌడ్ సతీమణికి గాయాలు

Share

 

హైదరాబాద్, మహా

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీకి గాయాలయ్యాయి. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ హాస్పిటల్​లో ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరుగు ప్రయాణంలో న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వర్షం కారణంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సుచియాష్కికి పక్కటెముకలు విరిగాయని, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. డాక్టర్ గగన యాష్కి న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా కాన్వాకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు ఇటీవల ఆయన అమెరికా వెళ్లారు. కాగా విషయం తెలిసిన వెంటనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధుయాష్కీకి ఫోన్ చేసి మాట్లాడారు.