- భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లా బ్రహ్మనాయుడు
- అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
- పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, మహా : దాదాపు రూ.1,500 కోట్ల విలువైన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ వివాదంలో నార్సింగి పోలీసులు తనతో పాటు మరికొందరిపై నమోదు చేసిన కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన ముందస్తుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో స్పందించాలంటూ అటు నార్సింగి పోలీసులకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆధారాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఇరుపక్షాల ప్రాథమిక వాదనలను విన్న అనంతరం, హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.
Post Views: 3








