- సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు
- గుట్టకిందగుంపులో 15 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైరా ఎమ్మెల్యే, గిడ్డంగుల సంస్ధ చైర్మన్
కారేపల్లి, మహా : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు లు అన్నారు. గురువారం సింగరేణి మండలం గుట్టకిందగుంపు గ్రామంలో గిడ్డంగుల సంస్ధ అధ్వర్యంలో రూ. 9.85కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 15 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే ,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందజేస్తూ ప్రజామన్నలను చూరగొంటుందన్నారు. అవినీతి లేకుండా ప్రజల సంక్షేమాన్ని అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వంను విమర్శిస్తే పలుచనైపోతారన్నారు.రాష్ట్రంలో రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు గోడౌన్ లు దోహాదం చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ లకు అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ ల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా పురోగతిలో ఉన్నాయని, రెండేళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల నిల్వకు 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ లను అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రైతు గోడౌన్ ల నిర్మాణం పట్ల శ్రద్ధ చూప లేదన్నారు. అంతకుముందు గుట్టకిందగుంపు గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ ఉండం రాఘవులు తో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా పోలంపల్లి కోటిలింగాల వాగుపై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, తాహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇంచార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, పర్స ట్రస్ట్ చైర్మన్ పట్టాభి రామారావు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు భూక్య రంజిత్, సర్పంచ్ లు మేదరి వీరప్రతాఫ్, దారావత్ హేమలత, బానోత్ హీరా లాల్, గుగులోత్ వరలక్ష్మి, దండు ప్రవీణ్, మాజీ ఎంపీపీ లు పగడాల మంజుల, బానోతు దేవ్లా నాయక్, నాయకులు అడ్డగోడ ఐలయ్య, యాకుబ్ అలి, తదితరులు పాల్గొన్నారు.,








