Mahaa Daily Exclusive

  కోహెడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.!

Share

  • కోహెడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.!
  •  ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శనివారం శంకుస్థాపన
  • అంతర్జాతీయ హంగులతో నూతన పండ్ల మార్కెట్
  • హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే

 

ఇబ్రహీంపట్నం జూన్ 5 మహా:

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఆదిభట్ల సర్కిల్ కోహెడ రెవెన్యూ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను రేపు శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి హంగులతో దాదాపు 200 ఎకరాలలో పండ్ల మార్కెట్ శంకుస్థాపనలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొననున్నారు. ఆదిభట్ల సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు హాజరుకావాలని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆదిభట్ల డివిజన్ సీనియర్ నాయకులు జమ్మ రాజు కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జమ్మ రాజు కొనియాడారు.