Mahaa Daily Exclusive

  భారత ఆర్మీ నూతన చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్…

Share

భారత ఆర్మీ నూతన చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్.

ఢిల్లీ, మహా.

భారత తదుపరి సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. అత్యంత కీలకమైన ఈ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. దేశ భద్రతా వ్యవహారాలు, క్లిష్టమైన సైనిక వ్యూహాల్లో అపార అనుభవం ఉన్న ధీరజ్ సేథ్.. ప్రస్తుతం భారత సైన్యానికి ఉప సైన్యాధిపతి (వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా విశేష సేవలందిస్తున్నారు. ఆయన సమర్థతను, సుదీర్ఘ సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు ఈ అత్యున్నత బాధ్యతలను అప్పగించింది.

ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీకాలం జూన్ 30వ తేదీతో ముగియనుంది. ఆయన అదే రోజున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపేంద్ర ద్వివేది రిటైర్ అయిన రోజే నూతన చీఫ్‌గా ధీరజ్ సేథ్ పదవీబాధ్యతలు చేపట్టేలా రక్షణ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బాధ్యతలను చేపట్టనున్న ఆయన ఆధ్వర్యంలో భారత సైన్యం మరింత బలోపేతం కానుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.