Mahaa Daily Exclusive

  ఈనెల 17న ఆరుట్లకు సీఎం – ఆరుట్ల పబ్లిక్ స్కూలును పరిశీలించిన ఎమ్మెల్యే కలెక్టర్ సిపి

Share

ఇబ్రహీంపట్నం జూన్ 15 మహా:
ఆరుట్లకి ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రారంభానికి రానున్నారని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నేడు సీఎం సభా ప్రాంగణ ఏర్పాట్లను, విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆరుట్ల పబ్లిక్ పాఠశాలను, సీఎం సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. పేద ప్రజల కోసం నిర్మించిన పాఠశాలను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే రంగారెడ్డి కొనియాడా. ఈ యొక్క పాఠశాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.