Mahaa Daily Exclusive

  అక్రమ మైనింగ్ పై గీసుగొండ పోలీసుల ఉక్కు పాదం…

Share

  • అక్రమ మైనింగ్ పై గీసుగొండ పోలీసుల ఉక్కు పాదం
  • ఐదుగురి పై కేసులు నమోదు
  • ఒక జెసిబి, మూడు టిప్పర్ లారీలు స్వాధీనం
  • గీసుగొండ ఇన్స్పెక్టర్ డి విశ్వేశ్వర్

మహా వరంగల్ క్రైం ;

అక్రమ మైనింగ్ పై గీసుగొండ పోలీసులు ఉక్కు పాదం మోపారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి నుండి జెసిబి సహాయంతో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా గీసుగొండ ఏఎస్ఐ సుదర్శన్ తన సిబ్బంది తో చేరుకొని పరిశీలించగా, ఒక జేసీబి మూడు టిప్పర్ లారీలలో మట్టిని నింపుకొని ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత డ్రైవర్ల ను మట్టి రవాణా కు సంబంధించిన ప్రభుత్వ అనుమతి పత్రాలు అడుగగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేక పోయేసరికి వెంటనే వాటిని సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం గీసుగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గీసుగొండ ఏఎస్ఐ
పి సుదర్శన్ తెలిపిన ప్రకారం..
*నిందితుల వివరాలు:*
పెనుమల్లి గోపి కృష్ణ, తండ్రి పేరు శివయ్య, నివాసం రెమిడీ చర్ల, మండలం ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా, జెసిబి నెంబర్ టీఎస్ 04 ఈయూ 5139….
జెంగిలి శ్రీను, తండ్రి పేరు స్వామి నివాసం చెన్నారవుపేట, టిప్పర్ నెంబర్ ఏపీ 16 టీఎస్ 1429….
పైసా రాజు, తండ్రి పేరు కొమురయ్య, నివాసం చెన్నారవుపేట, టిప్పర్ నెంబర్ ఏపీ 39 టిఎన్ 8388..
శివరాత్రి రంజిత్, తండ్రి పేరు ఐల్లయ్య, నివాసం గరీబ్ నగర్, టిప్పర్ నెంబర్ టీఎస్ 10 యుసి 7096….
పెండాల బిక్షపతి, తండ్రి పేరు ఐల్లయ్య, నివాసం: ఓ-సిటీ వరంగల్. (టిప్పర్ లారీల ఓనర్)..గా పోలీసులు గుర్తించారు.
ఏఎస్ఐ సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై తెలిపిన ఐదుగురి పై కేసులు నమోదు చేయడం జరిగిందని గీసుగొండ ఇన్స్పెక్టర్ డి విశ్వేశ్వర్ తెలిపారు.