Mahaa Daily Exclusive

  విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతి కై కృషి చేయాలి…

Share

*విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతి కై కృషి చేయాలి*

*వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్*

మహా వరంగల్ క్రైం;

నిరంతరం విధినిర్వహణలో భాగంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తునే తమ పిల్లల అభ్యున్నతి కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ప్రతిష్టాత్మకమై ముంబాయి ఐఐటీ కళాశాలలో అడ్మిషన్ సాధించిన ఇన్స్‌స్పెక్టర్ కుమార్తెను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్తె యడ్లపల్లి సాత్విక జెఈఈ మెయిన్స్ పరీక్షలో 99.65 పర్సంటైల్ సాధించగా, ఇటీవల నిర్వహించిన జె.ఈ.ఈ అడ్వాన్స్ పరీక్షల్లో రాణించి 8808 ర్యాంక్‌తో ముంబాయి ఐఐటీ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీటు సాధించడం జరిగింది. దీనితో సాత్వికను వరంగల్ పోలీస్ కమిషనర్ తన చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సిపి సాత్వికతో ముచ్చటిస్తూ రాబోవు రోజుల్లో మరింత కష్టపడాల్సి వుంటుందని. దేశంలోనే అత్యున్నతమైన విద్యా సంస్థలో సీటు సాధించడం గొప్ప విషయమని, ఇదే రీతిలో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, ముఖ్యంగా నిరంతరం విధుల్లో వుందే పోలీసుల పిల్లలు గత కొద్ది సంవత్సరాలు చదువుల్లో రాణించడం, ఉన్నత ఉద్యోగాలను సాధించడం సంతోషాన్ని కలిగిస్తోందని సిపి తెలియజేసారు.