హైదరాబాద్, మహా
ఎఎన్ఎన్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వ్యూస్ లో దుమ్మురేపుతున్నాయి. 24గంటల్లో 15 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఎఎన్ఎన్ దూసుకుపోతోంది. తెలుగురాష్ట్రాల్లో వీక్షకుల ఆదరణతో ఎఎన్ఎన్ కు తిరుగులేదని మరోసారి చాటింది. ఎఎన్ఎన్ తెలుగు ప్రధాన ఛానల్ తో పాటు ఒరిజినల్స్, ఇన్ స్టా, ఫేసుబుక్ ఇలా అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఎఎన్ఎన్ తెలుగుప్రజల ఆదరణతో 24గంట్లలో కోటిన్నరకు పైగా వ్యూస్ సాధించి.. ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఎఎన్ఎన్ డిజిటల్ నెట్ వర్క్ లో తిరుగులేని సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసిన సీఈవో కంది రామచంద్రారెడ్డి ఉద్యోగుల సంతోషంలో పాలు పంచుకున్నారు. కోటిన్నర మంది ఒకేరోజు వీక్షించడం ఎఎన్ఎన్ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, నిజమే ఇజంగా అందరూ పనిచేసి సంస్థను మరింత పటిష్టపరచాలన్నారు.
…….








