సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కాకి రంగరాజ్.
* ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించడంపై కృతజ్ఞతలు.
* సీఎంకు అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుకు సాగుతానని వెల్లడి
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నగరంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన సీఎంతో భేటీ అయ్యారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రంగరాజ్.. ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తనను గుర్తించి, ఎంతో కీలకమైన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా రంగరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రికి అన్ని విధాలా అండగా ఉంటూ, మరింత బాధ్యతతో ప్రజాసేవలో ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పరితపిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారనే బలమైన విశ్వాసాన్ని కాకి రంగరాజ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.








