Mahaa Daily Exclusive

  చిరు వ్యాపారులకు ఊరట…ముందే చెప్పిన ‘మహా ‘

Share

  • చిరు వ్యాపారులకు ఊరట.
  • ముందే చెప్పిన ‘మహా ‘
  • పంచాయతీ స్థలంలో షాపుల నిర్మాణానికి ముగ్గు పోసిన పాలకవర్గం

దమ్మపేట, జూన్ 18 మహా :
డ్రైనేజీ ఆక్రమణలు చేసిన చిరు వ్యాపారులకు కొంత వరకు ఊరట కలిగించింది పంచాయతీ పాలకవర్గం. పట్టణ కేంద్రంలో ఉన్న సైడ్ డ్రైన్ లపై పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ,పాదచారులకు ,ఇతరత్రా సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ దర్జాగా ఆక్రమించుకున్న వారికి పంచాయతీ అధికారులు మొట్టికాయలు వేశారు. ఈ నెల 20 వ తేదీ వరకు కటాప్ డేట్ ను ప్రకటించి డ్రైనేజీ లపై షాపులను తొలగించాలని మరోమారు నోటీసులు అందించారు. అప్పటికీ తొలగించని పక్షంలో పోలీసులు ,రెవిన్యూ శాఖ , ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో జెసిబీ ఉపయోగించి డ్రైనేజీ లపై ఉన్న నిర్మాణాలు తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. దీంతో ఆక్రమణ దారులు ఏమి చేయాలో ఆర్దం కాని పరిస్థితి లో సతమతమవుతున్న సందర్బంలో డ్రైనేజీ లపై షాపుల ను నిర్వహిస్తున్న వారికి పంచాయతీ నిబంధనల ప్రకారం కొంత ఊరట కలిగించింది. ఈ క్రమంలో పాత సంతపాకల ప్రాంతంలో పంచాయతీ వారిచే మినీ షాపులను నిర్మించి అద్దెలకు ఇచ్చేవిదంగా ప్రయత్నం చేసింది.

ముందే చెప్పిన ‘ మహా ‘

నిరుపయోగంగా పడిఉన్న పంచాయతీ స్ధలాన్ని ఆక్రమణ దారులు ఆక్రమించుకోకముందే జాగ్రత్త పడి ,మినీ వ్యాపారులకు అవకాశం ఇస్తే పంచాయతీ కి అధనపు ఆదాయం తో పాటుగా ట్రాఫిక్ కు అంతరాయం ఉండదని మంగళవారం ప్రచురితమైన మహా పత్రిక కధనం లో పేర్కొంది.
దాని పర్యవసనం గా పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి , గ్రామ పెద్దలతో కలిసి పాలక మండలి సబ్యులతో పంచాయతీ స్ధలంలో నూతన షాపుల నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. ఇది చాలా శుభ పరిణామం గా ప్రజలు భావిస్తున్నారు.

దమ్మపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో షాపుల నిర్మాణానికి ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి ఉంది. గురువారం భూమి పూజ నిర్వహించి షాపులు నిర్మాణం చేయుటకు ఇంజనీర్ చే ముగ్గు పోశారు. 9 సం.ల క్రితం వరకు ఇట్టి స్థలంలో సంత నిర్వహించబడేది. ప్రస్తుతం సంత కొట్టులు రాజీవ్ గాంధీ సెంటర్ వైపు మళ్ళడం తో ఖాళీగా ఉన్న ఇట్టి పంచాయతీ ప్రదేశంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించి శుభ్రం చేయించి, షాపులు నిర్మాణం కొరకు గురువారం గ్రామ పెద్దల సమక్షంలో మొత్తం 19 షాపులకు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కార్యదర్శి బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా దమ్మపేట ప్రధాన రహదారి ఇరువైపుల గల డ్రైనేజీలపై ఆక్రమణ చేసిన వ్యాపారులకు నోటీసులు పంపించి ఖాళీ చేయాలని చెప్పడంతో పూర్తిగా డ్రైనేజీ షాప్ లు నిర్వహిస్తున్న వ్యాపారులు తమకు ప్రత్యామ్నాయ స్థలం కావాలి అని సర్పంచ్ ని కోరినందున 19 షాపులకు లాటరీ ద్వారా లీజు కేటాయింపు మరియు అధికారిక నిబంధనలు తప్పనిసరి తో లీజు వ్యవధి, నెలవారీ అద్దె చెల్లింపులు, మరియు నిర్వహణ నియమాల పై త్వరలో ఎవరైతే పూర్తిగా డ్రైన్ల పై వ్యాపారం చేస్తున్న వారికి ముందుగా అవకాశం అని తెలియజేశారు. జూన్ 20 వ తేదీన దమ్మపేట ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైన్ల ఆక్రమణలను జే. సి.బి తో తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికే పలు మార్లు ప్రతీ షాప్ యజమానికి నోటీస్లు ఇచ్చామని, మైక్ పెట్టి ప్రచారం చేశాం అని, ఇక అవకాశం ఇవ్వలేము అని డ్రైన్ పై నుండి రోడ్డు మధ్యలో షాప్ బోర్డు లు కూడా తొలగించాలి అని తెలియజేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, గ్రామస్తులు పగడాల రాంబాబు, చిన్నశెట్టి యుగంధర్, చిట్టిబాబు, గోపి, ముక్తేశ్వరరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, రూపా రాంబాబు, బత్తుల సాయి, పెరుమాళ్ళ కృష్ణమూర్తి, గట్ల సర్వేశ్వరరావు, శ్రీను, నాగరాజు, నల్లగట్ల సత్యంబాబు, వనమాల సూరిబాబు, ఏలూరి సత్తిబాబు, దేవయ్య, తిరువీధుల శ్రీను, పగడాల గోపి, భాస్కర్, పంచాయతీ సిబ్బంది మహాదేవ సాయి, కాకాని గణేష్, భీమా శ్రీనివాసరావు, కొప్పర్తి సింగ్ తదితరులు ఉన్నారు.
———///////