- ఎస్ఐఆర్ పై కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో అవగాహన
హాజరైన కౌన్సిలర్లు,కౌన్సిలర్ కంటెస్టెడ్ నాయకులు - బాధ్యతగా పనిచేయాలని సూచన
- అర్హులది ఒక్క ఓటు కూడా పోవద్దని వెల్లడి
- ఏ రోజుకారోజు అప్ డేట్ పంపాలని సూచన
- అందరూ కృషి చేయాలని వెల్లడి
- సమావేశంలో కంది శ్రీనివాస రెడ్డి, బాలూరి గోవర్ధన్ రెడ్డి , నరేష్ జాదవ్, సోయం బాపూరావు సూచనలు సలహాలు
ఆదిలాబాద్ : ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేలా అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ముఖ్యంగా బీఎల్ఏల పాత్ర ఇందులో చాలా కీలకమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు .శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు , కౌన్సిలర్ కంటెస్టెడ్ అభ్యర్ధులు,ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. మన ఓట్లు కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ఇందుకు బూత్ సూపర్ వైజర్లు , పార్టీ మండల అధ్యక్షులతో పాటు బీఎల్ఏ-2 లతో పాటు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రజలకు సర్ పై అవగాహన కల్పిస్తూ ఓటు కోల్పోకుండా చూడాలన్నారు. అలాగే ప్రతీ రోజు ఎన్ని ఎన్యుమరేషన్ ఫారాలు నింపించి బీఎల్ఓలకు అందించారో ఆ సంఖ్యవివరాలను ఏ రోజుకారోజు 7436859999 అనే నంబర్ కు పంపాలన్నారు. డెయిలీ అప్ డేట్ కోసం 8 మందితో ఓ బృందాన్ని నియమించిట్టు తెలిపారు. ఈవిరాలన్ని ప్రతీ రోజు గాంధీ భవన్ కు పంపుతామన్నారు. తమ వార్డుల వారీగా మ్యాపింగ్ కాని వివరాలు తెలుసుకుని మ్యాపింగ్ అయ్యేలా చేయాలన్నారు.దీనిపై అధిష్టానం నుండి కీలక ఆదేశాలున్నాయని ఎవరు కూడీ నిర్లక్ష్యం బహించవద్దన్నారు. అర్హుల ఓట్లు ఒక్కడి కూడా పోకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ , సర్ కోర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపూరావు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు ఇంకా జిల్లాలో ఓట్లు మ్యాపింగ్ కానివి ఉన్నాయని వాటి విషయంలో దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు,మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖిజర్ పాషా, బండారి సతీష్ ,అడ్డి భోజారెడ్డి, రఫీఖ్ , అనిల్ , గుడిపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.








