Mahaa Daily Exclusive

  జూనియర్ కళాశాలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్..

Share

కారేపల్లి, మహా:కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైని పరాస్ కుమార్ ఐఏఎస్ బుధవారం సందర్శించారు. కళాశాల తరగతి గదులను పరిశీలించి అధ్యాపకులతో మాట్లాడారు కళాశాలలో ఫలితాలు, ప్రవేశాల గురించి కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి ని అడ్మిషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఫలితాలలో ఖమ్మం జిల్లాలో 23 కళాశాలలో మొదటి స్థానంలో కారేపల్లి రావటం, ఇంటర్ మొదటి సంవత్సరంలో 180 అడ్మిషన్లు కావటంతో ట్రైనీ కలెక్టర్ అధ్యాపకులకు అభినందించారు. అన్ని తరగతులు సందర్శించి విద్యార్థుల హాజరు శాతం తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల తరగతి గదులు, ఇతర గదులు మరమ్మతులపై ఆరా తీశారు. ట్రైనీ కలెక్టర్ వెంట డిప్యూటి తహసీల్ధర్ కృష్ణయ్య, ఏంపీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.