Mahaa Daily Exclusive

  డబల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో అభివృద్ధి పనులు

Share

  1. డబల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో అభివృద్ధి పనులు
  2.  45 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి శ్రీకారం.

సత్తుపల్లి, జులై 4: మహా.

  1. పట్టణ పరిధిలోని వేంసూర్ రోడ్డు పరిసర ప్రాంతంలో గత పాలకులు నామమాత్రంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ గృహసముదాయాలలో కనీస మౌనిక సదుపాయాలు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం సమయంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే మురుగునీరు గృహ సముదాయాలలో నిలువ ఉండడంతో ఇండ్లలో నుండి బయటికి వచ్చే పరిస్థితి లేదని తమను ఆదుకోవాలని గృహ సముదాయాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వానికి నివేదిక పంపించి డబల్ బెడ్ రూమ్ గృహసమదాయలలో సుమారు 45 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డ్రైనేజీ పనుల ప్రారంభానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, స్థానిక మండల రెవెన్యూ ఆఫీసర్, మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ నరసింహ లతో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు. అనంతరం అధికారులకు పలు సూచనలు అందించి డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలా రాణి, పట్టణ అధ్యక్షులు గాదే చెన్నారావు, మున్సిపల్ ఏ.ఈ, ఇరిగేషన్ జే.ఈ పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Latest