Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్ ఆంధ్ర గల్లీలో “సమస్యలపై సమరం” కార్యక్రమం

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్ ఆంధ్ర గల్లీలో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ బి .ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది.

స్థానికులు ఎదుర్కొంటున్న జిహెచ్ఎంసి స్టార్మ్ వాటర్ లైన్, రోడ్డు దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, మంచినీటి ఇబ్బందులు, అలాగే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల గురించి స్థానికులు MGR గారికి వివరించారు. ముఖ్యంగా ప్రజలకు ప్రమాదకరంగా మారిన మూడు విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించి షిఫ్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సంబంధిత జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ SE గారితో మాట్లాడి ప్రమాదకరంగా ఉన్న మూడు విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్టింగ్ చేయిస్తానని భరోసా కల్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి గల్లీ, ప్రతి బస్తీలో ప్రజలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఆనంద్ గారు, శ్రీనివాస్, శ్యామ్ గౌడ్, కన్న యాదవ్, బాసిత్, అంజన్ కుమార్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest