సర్ ప్రక్రియ పూర్తిచేసుకున్న ఎమ్మెల్యే మల్ రెడ్డి.
తొర్రూర్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన బీఎల్వోలు..
ప్రక్రియ తీరుపై ఆరా తీసిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం జూలై 2 మహా:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారు సర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రక్రియ కొనసాగుతుండగా… బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా, తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యేకు బీఎల్వోలు ఎన్యూమరేషన్ పత్రం అందజేశారు. తన ఓటు వివరాలను అందజేసిన మల్ రెడ్డి… ఎన్యూమరేషన్ పత్రం పూర్తిచేసి, వారికి అందజేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న తీరు, ప్రజల నుంచి సహకారం గురించి ఆరా తీశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ఓటు వివరాలను అందజేయాలని, ఇందుకు కార్యకర్తలు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.








