Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో 11 కమిటీల నియామకం..! ఎస్టీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ గా పాయం వెంకటేశ్వర్లు..!

Share

హైదరాబాద్, మహా

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యవహరించనున్నారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను పరిశీలించే ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉండనున్నారు. జాయింట్ కమిటీకి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అసెంబ్లీ నిర్వహణకు వివిధ కమిటీలన్నీ నియమించారు.

 

ఉమ్మడి కమిటీలు

 

-సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ – కడియం శ్రీహరి

-అమెనిటీస్ కమిటీ – సభాపతి,

– తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ – మేడిపల్లి సత్యం

– షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ – పాయం వెంకటేశ్వర్లు

– వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ – మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

– గ్రంథాలయ కమిటీ – డా. మట్టా రాగమయి

– మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ కమిటీ – శ్రీమతి చిట్టెం పర్ణికా రెడ్డి

– మైనారిటీల సంక్షేమ కమిటీ – లక్ష్మీకాంతరావు తోట

– వన్యప్రాణులు మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ – సభాపతి, తెలంగాణ శాసనసభ

 

శాసనసభ కమిటీలు

 

– పిటిషన్స్ కమిటీ – ఉప సభాపతి, తెలంగాణ శాసనసభ

-ప్రివిలేజెస్ కమిటీ – ఉప సభాపతి,

-తెలంగాణ శాసనసభ ప్రభుత్వ హామీల కమిటీ – పట్లోళ్ల సంజీవ రెడ్డి

-రూల్స్ కమిటీ – సభాపతి,

-తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ – రేవూరి ప్రకాశ్ రెడ్డి

 

శాసనమండలి కమిటీలు

 

-పిటిషన్స్ కమిటీ – ఉప ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి

-ప్రివిలేజెస్ కమిటీ – ఉప ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి

-ప్రభుత్వ హామీల కమిటీ – కేతావత్ శంకర్

– రూల్స్ కమిటీ – ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి సభ

-ముందుంచిన పత్రాల కమిటీ – చల్లా వెంకట్రాం రెడ్డి

– ఎథిక్స్ కమిటీ – మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ

Latest