కారేపల్లి, మహా : జర్నలిస్టు అజ్మీర వీరన్న మాతృమ్మూర్తి అజ్మీ ఈరీ సంస్మరణ కార్యక్రమం బుధవారం కారేపల్లి మండలం భీక్యాతండాలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ మాజీ ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్, వివిధ పార్టీల నాయకులు హాజరై ఈరీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళ్లు అర్పించారు. ఈరీ కుమారులైన జర్నలిస్టు అజ్మీర వీరన్న, ఏఐటీయుసీ నాయకులు అజ్మీర బిచ్చానాయక్, సురేష్ లను నాయకులు పరామర్శించి సానుభూతిని తెలిపారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, కే.నరేంద్ర, శోభన్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తోటకూరి రాంబాబు, పగడాల మంజుల, బానోత్ రాంమ్మూర్తి, నర్సింగ్ శ్రీనివాసరావు, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు లాకావత్ గిరిబాబు, హన్మకొండ రమేష్, బత్తుల శ్రీనివాస్, జాల సాంబ, నాయకులు బోళ్ల రమేష్,ఆదెర్ల రాములు, ఎండీ హనీఫ్, వాచ్యా, చాంది తదితరులు పాల్గొన్నారు.








