Mahaa Daily Exclusive

  అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం..! అధికారులతో వైరా ఎమ్మెల్యే సమీక్షా..

Share

  • ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ది
  • అధికారులతో వైరా ఎమ్మెల్యే సమీక్షా

 

కారేపల్లి, మహా : ప్రజాపాలనతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న రేవంత్ ప్రభుత్వంకు ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కోరారు. బుధవారం కారేపల్లి మండలం అప్పాయిగూడెంలో ఈనెల 10 తేదిన జరగనున్న ఆశీర్వాద సభ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు, అధికారుల నుండి ప్రోత్సహం అవసరమన్నారు. చింతకాని మండలం జగన్నాధపురంలో ఆశీర్వాద సభను అన్ని హంగులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అని శాఖల నుండి స్టాల్ ఏర్పాటు చేసి అధునిక పరకరాల పరిచయం, వ్యవసాయం, ఉపాధి, మహిళ సాధికారితపై నిపుణులతో ముఖాముఖీలు, సలహాలు అందిచటం జరుగుతుందన్నారు. పంట సాయం రైతు భరోసా అందించి రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి కావల్సిన అన్ని అవసరాలు, మద్దతుధర, బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అశీర్వాద బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలను తరలించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఎంపీడీవో బీ.పద్మ, తహసీల్ధార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, తలారి చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Latest