Mahaa Daily Exclusive

  మంచిరేవులలో శ్రీ మచిలేశ్వర–వీరభద్ర స్వామి సన్నిధిలో టీపీసీసీ అధ్యక్షుడు…

Share

 

రంగారెడ్డి, మహా.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మచిలేశ్వర స్వామి–వీరభద్ర స్వామి ఆలయాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న మహేష్ కుమార్ గౌడ్‌కు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని శ్రీ మచిలేశ్వర స్వామి, వీరభద్ర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఆలయానికి విచ్చేసిన భక్తులు టీపీసీసీ అధ్యక్షుడిని ఆత్మీయంగా పలకరించగా, ఆయన అందరితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో గడిపిన మహేష్ కుమార్ గౌడ్ భక్తులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.