Mahaa Daily Exclusive

  యూత్ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ విస్మరించింది: యువ సంగ్రామ సదస్సులో మన్నె గోవర్ధన్ రెడ్డి మండిపాటు..

Share

“యూత్ డిక్లరేషన్” పేరుతో తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు అదే యువతను నిరాశలోకి నెట్టిందని నిరసిస్తూ, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో, ఖైరతాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువతతో కలిసి ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు, నిరుద్యోగ భృతి, నియామకాల భర్తీ, విద్యార్థుల సంక్షేమం వంటి కీలక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరచిపోయి, తెలంగాణ యువత ఆశలను, భవిష్యత్తును వమ్ము చేసిందని విమర్శించారు.

యువత జీవితాలతో రాజకీయాలు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎన్నటికీ క్షమించరని పేర్కొంటూ, యువతకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ యువత హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, న్యాయం కోసం ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని తెలిపారు.

తెలంగాణ యువతకు అండగా నిలుస్తూ, వారి భవిష్యత్తు కోసం ప్రతి వేదికపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్ గారు, ఎర్రమంజిల్ డివిజన్ సీనియర్ నాయకులు నిశాంత్ ముదిరాజు గారు మరియు బి ఆర్ ఎస్ వి నాయకులు నవీన్ నాయక్, ఖైరతాబాద్ డివిజన్ నాయకులు శ్రావణ్ మరియు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు