Mahaa Daily Exclusive

  భారతీయ గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు..

Share

అన్ని రంగాల్లో అస్తిత్వాన్ని చాటుకుని, అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం కొత్త వెలుగు ప్రసరిస్తోంది. అంతరాలను పూడ్చడమే కాకుండా ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత, ఆరోగ్య సదుపాయాలను మెరుగు పరచడం, ఆర్థిక అవకాశాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సుదీర్ఘ కాలంగా విస్మృతులుగా మిగిలిపోయిన ఆ సమూహాలకు ప్రతిష్ఠాత్మకమైన చర్యలతో పురోగతి, అభ్యున్నతి, సమానావకాశాలను కల్పించడం ద్వారా గిరిజన పౌరులతో తన సంబంధాలను భారత్ పునరుద్ధరించుకుంటోంది. మరింత ఉజ్వలమైన, సమ్మిళిత భవిష్యత్తు దిశగా చరిత్రలో నిలిచేపోయే విధంగా చేపట్టిన ‘మొదటి’ కార్యక్రమాలను ఒక సారి ఫరిశీలిద్దాం.

 

5.7 రేట్లు పెరిగిన నిధులు

 

గిరిజనుల సంక్షేమం కోసం ఆర్థిక కేటాయింపులు మొదటిసారి రికార్డు స్థాయికి చేరాయి. ఎస్టీల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక నిధులు 2013-14లో రూ. 24,600 కోట్ల నుంచి 2024-25 నాటికి దాదాపు అయిదు రెట్లు పెరిగి రూ.1.23 లక్షల కోట్లకు చేరాయి. ఇది విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. గిరిజన సమాజాల సాధికారత పట్ల బలమైన నిబద్ధతకు ఇది నిదర్శనం.

 

గిరిజన విద్యలో విప్లవాత్మక మార్పులు

 

పాఠశాలలు, ఉపకార వేతనాలు, మరెన్నో అవకాశాలు!

 

గిరిజన విద్యార్థులు ఎట్టకేలకు తగిన విద్యావకాశాలను పొందుతున్నారు. పాఠశాలల్లో నమోదైన వారి సంఖ్య 2013-14లో 34,000 ఉండగా, 2023-24 నాటికి అది 1.3 లక్షలకు పెరిగింది. ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు (ఈఎంఆర్ఎస్) పెరగడం ఈ మార్పునకు మూల కారణం. దశాబ్ద కాలంలోనే వాటి సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 123 నుంచి 476 కు చేరింది. కేవలం విద్యను అందించడం మాత్రమే కాకుండా.. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా గిరిజన యువత జీవితాలను మార్చివేస్తున్నాయి.

 

రక్తహీనతను అరికట్టడానికి మొదటిసారిగా దేశవ్యాప్త కార్యక్రమం

 

సికిల్ సెల్ రక్తహీనతను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం గిరిజన సమాజం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విశేషంగా పరిష్కరిస్తోంది. ఇప్పటికే 4.6 కోట్ల మందిని ఇందులో భాగంగా పరీక్షించారు. మూడేళ్లలో 7 కోట్ల మందిని చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించారు. రక్తహీనతను అరికట్టే ఈ కార్యక్రమం కేవలం ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ గిరిజనులకు భరోసాతో కూడిన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం దీని లక్ష్యం.

 

ఉపకార వేతనాల పునరుద్ధరణ

 

గిరిజన విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక సాయం!

 

తొలిసారిగా గిరిజన విద్యార్థులకు విస్తృతంగా ఉపకార వేతనాలు అందుతున్నాయి. వీటి ద్వారా ఏటా 30 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. గత పదేళ్లలో మొత్తం రూ. 17,000 కోట్లు పంపిణీ చేశారు. ఈ ఉపకార వేతనాలు కేవలం ఆర్థిక చేయూత మాత్రమే కాదు గిరిజన యువత సాధికారతకు అవి బాటలు పరుస్తున్నాయి. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కృషికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. వారి గౌరవార్థం 10 ప్రదర్శన శాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆయనకు నివాళి. భారతీయ గిరిజనుల పునరుజ్జీవనానికి నిదర్శనం. మొదటిసారిగా, గిరిజన యోధుల గాథలను సగౌరవంగా కీర్తిస్తూ వారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం పరిరక్షిస్తోంది.

పెరుగుతున్న గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు

 

వన్ ధన్ కేంద్రాల ద్వారా స్వావలంబన

 

గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం 3900 వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు కీలకమైన మైలురాయి. వీటి ద్వారా దాదాపు 12 లక్షల మంది గిరిజన పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నారు. సంప్రదాయక నైపుణ్యాలను లాభసాటి అవకాశాలుగా మార్చుకోవడానికీ.. ఆర్థిక స్వావలంబనకు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కేంద్రాలు గిరిజనులకు వీలు కల్పిస్తున్నాయి.

 

భారత తొలి గిరిజన రాష్ట్రపతి

 

ప్రాతినిధ్యంలో చరిత్రాత్మక మైలురాయి

 

భారతదేశపు తొలి గిరిజన రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్నిక గిరిజన ప్రాతినిధ్యంలో ఒక ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో సమ్మిళితత్వంతో పాటు.. అవరోధాలు తొలగిపోతున్నాయన్న శక్తిమంతమైన సందేశాన్ని అది అందిస్తోంది. ఆమె రాష్ట్రపతి పదవి దేశంలోని లక్షలాది మంది గిరిజనుల ఆశలు, అవకాశాలకు చిహ్నంగా నిలుస్తుంది.

 

మారుమూల గిరిజన ప్రాంతాలకు ప్రాథమిక సదుపాయాల కల్పన

 

పీఎం-జన్ మన్ ద్వారా గృహనిర్మాణం, శుద్ధమైన నీరు, పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ వంటి అత్యవసర సేవలు మొదటిసారిగా అత్యంత బలహీనమైన గిరిజన సమూహాలకు చేరుతున్నాయి. 75 అత్యంత దుర్బల గిరిజన సమూహాలు (పీవీటీజీ), 45 లక్షలకు పైగా కుటుంబాలకు రూ. 24,000 కోట్లకు పైగా బడ్జెట్ తో కేటాయింపులు చేశారు. ఈ కార్యక్రమం మారుమూల గిరిజన సమాజాలకు జీవనాధారం.

 

జమ్మూ, కశ్మీర్ గిరిజనులకు అవకాశాలు

 

విద్య, ఉద్యోగాల్లో సరికొత్త అవకాశాలు

 

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ లో షెడ్యూల్డ్ తెగలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరుస్తూ ఈ ప్రాంతంలోని గిరిజన సమాజాల్లో సమ్మిళిత్వాన్ని ఇది పెంపొందిస్తుంది.

 

కొత్త ఆదాయ వనరులు

 

గిరిజనుల అభ్యున్నతి కోసం ఆకుపచ్చ బంగారంగా వెదురు

 

తొలిసారిగా వెదురును చెట్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా స్వేచ్ఛగా దానిని కోసుకోవడానికి గిరిజనులకు అవకాశం లభించింది. ఈ మార్పు గిరిజన కుటుంబాలకు సరికొత్త ఆదాయ వనరుగా మారడంతో పాటు సుస్థిరమైన అవకాశాలను కల్పిస్తూ, ‘ఆకుపచ్చ బంగారం’గా వెదురు గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడుతోంది.

 

గిరిజన ప్రాంతాలకు 100% చేరువయ్యే లక్ష్యం

 

జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా తొలిసారిగా గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. 63 వేల గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. 5 కోట్ల మంది గిరిజన ప్రజలకు 100% ప్రయోజనాలు చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 80 వేల కోట్ల బడ్జెట్ తో చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా పెట్టుకుంది.

 

గిరిజన సాధికారత సాధనంగా ఎంఎస్పీ

 

తొలిసారిగా.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థ గిరిజన వర్గాలకు సాధికారిక సాధనంగా మారింది. కనీస మద్దతు ధర పొందే చిన్న అటవీ ఉత్పత్తుల సంఖ్యను 12 నుంచి 87కు పెంచడం గిరిజన వర్గాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలను అందించడంతోపాటు వనరుల వినియోగంలో సుస్థిరతను ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు, వనరులు, అవకాశాలను తొలిసారిగా అందించడం ద్వారా మన గిరిజన సోదరీ సోదరుల జీవనాల్లో శాశ్వతమైన మార్పును తెస్తోంది. దశాబ్ధాల నిర్లక్ష్యం అనంతరం.. భారతదేశ అభివృద్ధిలో- సాధికారత, పునరుజ్జీవనంలో వారిప్పుడు ముందువరుసలో నిలిచారు. తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవడానికి సంసిద్ధులయ్యారు.