Mahaa Daily Exclusive

  బంజారాహిల్స్‌లో మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) పాదయాత్ర: ప్రజా సమస్యలపై అధికారులతో ఫోన్‌లో లైవ్ టాక్!

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్‌లోని సింగాడ బస్తి మరియు ఉదయ్ నగర్ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ఉద్యమ నాయకుడు జట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.

పాదయాత్ర అనంతరం స్థానికులు తమ సమస్యలను MGR గారి దృష్టికి తీసుకువచ్చారు. గత కొన్ని నెలలుగా మెయిన్ నాలా దెబ్బతినడం, రోడ్డు మధ్యలో ఉన్న క్యాచ్‌పిట్ పూర్తిగా దెబ్బతినడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుమార్లు ఫిర్యాదు చేసినా GHMC అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా డి లైన్ గల్లీలో డ్రైనేజ్ లైన్ పాడైనందున వాటర్ వర్క్స్ సూపర్వైజర్ అశోక్ గారితో MGR గారు ఫోన్‌లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న రెండు ఐరన్ విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని బంజారాహిల్స్ ఎలక్ట్రికల్ AE గారితో మాట్లాడి సూచించారు.

MGR గారి జోక్యంతో వెంటనే స్పందించిన సంబంధిత అధికారులు రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రామ్ చందర్, శంకర్ ముదిరాజ్, పాతర్ల నరసింహ, మూర్తుజా, ప్రభాకర్ రెడ్డి, సారంగపాణి, నరసింహ, రఘు, ఆంజనేయులు, అయూబ్, ప్రసాద్, అన్వార్, దినేష్, నరేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.