తుంగభద్రకు మళ్లీ వరద జలాలు.
• ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో పెరిగిన ఇన్‌ఫ్లో.
• నీటి నిల్వలు 26.454 టీఎంసీలకు చేరిక.
అనంతపురం, మహా.
ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 13,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, నీటి మట్టం 1603.54 అడుగులకు చేరింది. డ్యాంలో మొత్తం నీటి నిల్వలు 26.454 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వారం రోజులుగా జలాశయానికి వచ్చే వరద ప్రవాహం సుమారు 1,000 క్యూసెక్కులకు పడిపోవడంతో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమైంది. అయితే ఎగువ ప్రాంతాల్లో తాజా వర్షాలు కురవడంతో ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగి పరిస్థితి మెరుగుపడింది. రానున్న రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Post Views: 3








