Mahaa Daily Exclusive

  హరీష్ పర్యటన.. ఓ జోక్. నాగలి పట్టి దున్నిన ముఖాలా మీవి..?

Share

  • రైతులకు బేడీలు వేసిన మీరా మాట్లాడేది?
  • నిన్నటివరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్.. మీసాలు తిప్పుతున్నాడు
  • కార్తీకమాసంలో దుష్టశక్తుల అపశకునాలు
  • నిద్రాహారాలు మాని.. రేవంత్ పనిచేస్తున్నారు
  • సీఎం పనితీరు బేష్.. కొత్తగూడెంకు ఎయిర్ పోర్టు తెస్తున్నాం
  • ఏనుగులు పోతుంటే.. కుక్కలు మొరగడం కామన్
  • బీఆర్ఎస్ మాజీమంత్రుల పర్యటనపై భగ్గుమన్న ఎంపీ రేణుకాచౌదరి

ఖమ్మం, మహా –

రైతులకు బేడీలు వేసి నానా హింసలు పెట్టిన బిఆర్ఎస్ నేతలు, మాజీమంత్రి హరీష్ ఖమ్మంలో పర్యటించడం పెద్ద జోక్ అని, నాగలిపట్టి దున్నిన ముఖాలా మీవి.. కమిషన్ కాకతీయ కమిషన్ భగీరథ బతుకులు అంటూ ఎంపీ రేణుకాచౌదరి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్ ఇపుడు మీసాలు తిప్పుతున్నాడని, రైతులకు భేడీలు వేసిన దుష్టశక్తులు ఇవ్వాళ మాట్లాడుతున్నారన్నారు.
కార్తీక మాసం లో అపశకుణం మాటలు మాట్లాడుతున్నారని, గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది.. కొయిన్ని వెంకన్నను అడిగితే మీ పాపాలు బయట పడతాయంటూ భగ్గుమన్నారు. మీకు ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండి…. స్వీకరిస్తామన్నారు. బిడ్డను జైల్ నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పాలన భేషుగ్గా ఉంది. బి ఆర్ ఎస్ వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయి. హరీష్ రావు పర్యటననే ఓ జోక్. నాగలి పట్టి దున్నిన మోహలా మీవి. మీ బ్రతుకులు కమిషన్ కాకతీయ,కమిషన్ భగీరథ అంటూ రేణుకాచౌదరి ధ్వజమెత్తారు. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారు. బేడీలు వేసిన చరిత్ర మీది కాదా? ప్రజలను నానా హింసలు పెట్టింది మీరు కాదా? ఓడిపోయి ఏమి చేయాలో తెలియక ఇలాంటి జోకులు చేస్తున్నారు. నిద్ర హారాలు మని రేవంత్ పని చేస్తున్నారు. మీకు ఆత్మగౌరవం ఉందా? మీకు రాష్ట్ర ప్రయోజనాల మీద కమిట్మెంట్ ఉందా? మీ రాజ్యసభ సభ్యులు ఏ స్కీం తెచ్చారు? పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు? దమ్ముంటే నాతో రా….కలిసి నడుద్దాం అంటూ సవాల్ చేశారు. బి ఆర్ ఎస్ వాళ్ళు మోపిన భారాన్ని ఇపుడు అందరం కట్టాల్సిన పరిస్థితి నెలకొందని, నెల కాగానే జీతాలు ఇస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలతో సుజాతనగర్ లో రైతులు ఇబ్బందులు పడితే రైతుకు 6500 ఇప్పించానని, నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు.

కొత్తగూడెంకు కార్గో ప్లెయిన్

కొత్తగూడెం లో ఫ్రీ కండిషన్ ఎయిర్ పోర్ట్ రానుందని, కార్గో ప్లెయిన్ కూడా అడిగానని రేణుకాచౌదరి తెలిపారు. ఖమ్మం జిల్లాలో అడవి అనేది లేకుండా పోయిందని, వైరా లో రైతులకు పంటల పై అవగాహన కోసం హాస్టల్ కట్టించాలని అనుకున్నామన్నారు. ఖమ్మం ను మార్చిపోనే పోనని, తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను.ఆ బిరుదు శాశ్వతమన్నారు. వచ్చే ఏడాది స్థంభాద్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని, మత్స్యకారుల పండుగ రోజున పాలేరు లో ఉత్సవాలు జరుపబోతున్నామన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ మంత్రిని కోరానన్నారు. కేటిపిఎస్ లో 7వ స్టేజి వచ్చిందంటే తన కృషి ఉందని, బీజేపీ ప్రభుత్వం పాల్వంచ స్పాంజ్ ఐరన్ ను మూసి వేసిందన్నారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్ళీ తెరిపించాలని పోరాటం చేస్తానన్నారు. కేటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కాళేశ్వరం మొత్తం డొల్ల అంటే మీరు ఒప్పుకుంటారా?
మూసి ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమేనని, ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
…….