Mahaa Daily Exclusive

  కారేపల్లి కేంద్రంగా కల్తీ బంగారం వ్యాపారం…

Share

  • కారేపల్లి కేంద్రంగా కల్తీ బంగారం వ్యాపారం…
  • రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో పెట్టిన ముఠా
  • కారేపల్లి కి చెందిన వ్యాపారే కీలక సూత్రధారి
  • నకిలీ బంగారంతో కోట్లు గడించిన ముఠా
  • 200 మంది ఏజంట్లతో ముఠా కార్యకలాపాలు
  • ముఠా మోసాలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

కారేపల్లి, మహా :కారేపల్లి కేంద్రంగా నకిలీ బంగారం వ్యాపారం కలకలం రేపుతోంది..రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో నకిలీ బంగారంతో అనేక మోసాలకు పాల్పడుతున్న ముఠా సూత్రధారి కారేపల్లికి చెందిన వ్యాపారి కావడంతో మండల వ్యాప్తంగా నకిలీ బంగారం విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది. కారేపల్లికి చెందిన వ్యాపారి గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 200 మందితో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని నకిలీ బంగారం వ్యాపారం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ బంగారం విషయంలో కారేపల్లి పోలీసులు ఇటీవల ముమ్మర దర్యాప్తు చేపట్టి వ్యాపారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కారేపల్లి మండలానికి చెందిన కొందరు ఇల్లందు బ్యాంకుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి విషయం బయటకు రావడంతో గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు బ్యాంకుల్లో చెల్లించి నకిలీ బంగారాన్ని బయటికి తెచ్చిన విషయంలో కూడా ఇల్లందు పోలీసులు గతంలో విచారణ కూడా చేపట్టారు. బ్యాంక్ అధికారులు రికవరీ ఆలోచనతో ఫిర్యాదులు చేయకపోవడంతో ముఠా కార్యకలాపాలు ఇంతకాలం కొనసాగాయనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బంగారం ముఠా గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారం ముసుగులో అనేక మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయల కూడగట్టినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ముఠా కార్యకలాపాలను నియంత్రించాలని కారేపల్లి పోలీసులు ముఠా సభ్యులపై నిఘా పెట్టి కీలకమైన సమాచారమే సేకరించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. వాటి ఆధారంగానే పోలీసులు మమ్ముర దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారాలన్నీ త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంద