- బాధిత మహిళలకు భరోసా కల్పించి సత్వరమే న్యాయం చేయాలి
- క్రైమ్స్ ఏసీపీ సదయ్య
- మహిళా పోలీస్ స్టేషన్–2 తనిఖీ
వరంగల్, క్రైం;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగంపేట మహిళా పోలీస్ స్టేషన్–2 ను వార్షిక తనిఖీల్లో భాగంగా క్రైమ్స్ ఏసీపీ సదయ్య తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, బాధిత మహిళలకు అందిస్తున్న సేవలు, పెండింగ్ కేసులు, ప్రస్తుత దర్యాప్తులో వున్న కేసులు, నిందితుల అరెస్ట్, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళల ఫిర్యాదులను అత్యంత సున్నితంగా, గౌరవప్రదంగా స్వీకరించి, వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా బాధిత మహిళలకు భరోసా కల్పిస్తూ వారికి అవసరమైన సహాయం అందించాలని, స్టేషన్ కు వచ్చే ప్రతి మహిళతో మర్యాద పూర్వకంగా, సానుభూతి తో వ్యవహరించాలని సూచించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, పరిశుభ్రత, క్రమశిక్షణ పాటించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో మహిళా పోలీస్ స్టేషన్–2 ఇన్స్పెక్టర్ సువర్ణ తో పాటు , ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






