Mahaa Daily Exclusive

  సీనియర్ ఐఏఎస్ ను కలిసిన బేతి అశోక్….

Share

 

వరంగల్, మహా;

వరంగల్ వాసులకు సుపరిచితులు, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మధ్యప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్‌ లో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న పరికిపండ్ల నరహరి ని న్యూఢిల్లీ లోని కర్తవ్య భవన్‌ లో పద్మశాలి యువజన సంఘం వరంగల్ అధ్యక్షులు బేతి అశోక్ బాబు,19వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమరేష్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించారు.
పద్మశాలి ముద్దు బిడ్డగా పేరు గాంచిన పరికిపండ్ల నరహరి హమారి లక్ష్మి లాడ్లీ యోజన” (బేటీ బచావో – బేటీ పడావో భావనకు అనుగుణంగా రూపొందిన పథకం) రూపకర్తగా గుర్తింపు పొందారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. వికలాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న పలు సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా యువ నాయకులు ముందుకు వచ్చి ప్రజా సేవలో పాల్గొనాలని, నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పరికిపండ్ల నరహరి సూచించారు.