Mahaa Daily Exclusive

  నకిలీ బంగారం చలామణి పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం…

Share

  • నకిలీ బంగారం చలామణి పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
  • పోలీసుల అదుపులో నకిలీ బంగార సూత్రధారి…?

కారేపల్లి, మహ: తక్కువ ధరకే బంగారం ఇస్తానని అమాయక ప్రజలను నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సింగరేణి మండల కేంద్రానికి చెందిన ఆ వ్యక్తితో పాటు ఇంకొంతమందికి ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్నట్లు తెలిసింది. మండలంలో నకిలీ బంగారం చలామణి కొంతకాలంగా సాగుతుంది. బంగారం పూత పూసిన గాజులు, కడియాలు, మందపాటి గొలుసులను తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ అమాయకులకు అంటగట్టటంతో పాటు వాటిని బ్యాంకుల్లో సైతం తాకట్టు పెట్టించి రుణాలు తీసుకున్నారు. ఇట్టి విషయం గుర్తించిన బ్యాంకులు ఆయా వ్యక్తులు నుండి రికవరీ చేయించాయి తప్ప పోలీసులకు ఫిర్యాదులు చేయలేదు. నకిలీ బంగారంతో మోసపోయిన వ్యక్తులు ఫిర్యాదుతో పోలీసులు రెండు రోజులుగా విచారణ ముమ్మరం చేశారు. దానిలో భాగంగా కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై భైరు గోపిని వివరణ అడగగా నకిలీ బంగారం వ్యవహారంలో విచారణ చేస్తున్నట్లు పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.