Mahaa Daily Exclusive

  జూరాలకు భారీ వరద….

Share

జూరాలకు భారీ వరద.
* 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.
* వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల.
* శ్రీశైలానికి 1.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

జోగులాంబ గద్వాల,మహా.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1.74 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయ భద్రత దృష్ట్యా వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి 1.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగి, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 1.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.