Mahaa Daily Exclusive

  న్యూ ఇండియా బ్రాండ్ ఇమేజ్: ప్రధాని మోదీ వైపు డిజిటల్ జనరేషన్ ఎందుకు ఆకర్షితమవుతోంది

Share

 

ఒక పక్క స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై వేగంగా స్క్రోల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్… మరోపక్క దూసుకుపోతున్న వందే భారత్ ట్రైన్స్, చంద్రుడిపై సగర్వంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 విజువల్స్. ఆ వీడియో కింద ఓ పన్నెండేళ్ల పిల్లాడి కామెంట్.. “మోదీ జీ, వి ఆర్ విత్ యూ!” ఇది కేవలం ఒక ఇంటర్నెట్ ట్రెండ్ కాదు, “నయా భారత్” రాజకీయ ముఖచిత్రంపై మారుతున్న సరికొత్త ‘వైబ్’. 2010 – 2024 మధ్య జన్మించిన ‘జెన్ ఆల్ఫా’ తరం ఓటు హక్కు లేని వయసులోనే దేశ భవిష్యత్తుపై, సుస్థిర నాయకత్వంపై చూపుతున్న ఆసక్తి పొలిటికల్ పండిట్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానమంత్రి నాయకత్వానికి ఈ డిజిటల్ కిడ్స్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారో గ్లోబల్ స్టాండర్డ్స్‌లో విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తాయి.

ప్రధాని ఇటీవల పోస్ట్ చేసిన కేవలం 5 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఏకంగా 1.076 బిలియన్ల అంటే సుమారు 107 కోట్లు వ్యూస్ సాధించడం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. రికార్డు స్థాయి రీచ్ తో ఈ ఐదు వీడియోలు వరుసగా 103, 91.1, 186, 286 మరియు 410 మిలియన్ వ్యూస్ రాబట్టాయి. ఇది సాధారణ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సైతం సాధ్యం కాని రీచ్. ఈ ఫాక్ట్స్ చూసి నెటిజన్లు సరదాగా “మోదీ ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ను క్రాక్ చేశారు” అని, “పిఎమ్ మోదీ హేజ్ ఎంటర్డ్ హిజ్ రీల్స్ ఎరా” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా రికార్డు మాత్రమే కాదు. జెన్ జీ, జెన్ ఆల్ఫా జనరేషన్ తో పాటు, యువత ఎక్కువగా గడిపే ప్లాట్‌ఫామ్స్‌లో వారికి చేరువయ్యేందుకు రాజకీయ నాయకులు ట్రెడిషనల్ మీడియాను అంటే టీవీ, న్యూస్ పేపర్స్ ను దాటి ‘షార్ట్-ఫామ్ కంటెంట్’ వైపు ఎలా మళ్లుతున్నారో చెప్పేందుకు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ.

ఇక స్క్రోలింగ్ నుంచి నేషనల్ అవేర్‌నెస్ దాకా.. తమకు ముందున్న ‘జెన్ జీ తరంలో కనిపించే కొంచెం గందరగోళ ధోరణులకు భిన్నంగా జెన్ ఆల్ఫా అత్యంత వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉంది. ప్రపంచ పరిణామాలపై వీరికి అద్భుతమైన ‘హైపర్-అవేర్‌నెస్’ ఉంటోంది. టెర్రర్ అటాక్స్ లేని ప్రశాంత వాతావరణం, కోవిడ్ వంటి క్రైసిస్ ను దేశం ఎదుర్కొన్న తీరు వీరి మనసుల్లో బలమైన ముద్ర వేశాయి. ఈ జనరేషన్ ఫిజికల్, డిజిటల్ ప్రపంచాల కలయిక అయిన ‘ఫిజిటల్’ వాతావరణంలో పుట్టి పెరిగిన మొదటి తరం. వీరికి సుదీర్ఘమైన స్పీచ్ ల కంటే, కళ్ల ముందు కనిపించే విజువల్ ప్రూఫ్స్ ముఖ్యం. ‘డిజిటల్ ఇండియా’ విప్లవం వీరి దైనందిన జీవితంలో భాగమైంది. ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నూతన పార్లమెంట్ భవనం, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వంటివి వీరిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇన్‌స్టంట్ ప్రాసెసింగ్ కోరుకునే ఈ పిల్లలకు, ప్రభుత్వం వేస్తున్న అడుగులు స్పష్టంగా, వేగంగా కనబడుతున్నాయి.

లీడర్‌షిప్ అండ్ ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ ప్రభావం
చాలా ఉంది. పిల్లలు సహజంగానే ఆత్మవిశ్వాసం, స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నవారిని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రధాని మోదీ దైనందిన జీవితంలో చూపే క్రమశిక్షణ, గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఆయనకు దక్కుతున్న గౌరవం ఈ పిల్లల్లో దేశభక్తిని పెంచుతున్నాయి. పరీక్షా పే చర్చ , రక్షాబంధన్, స్పోర్ట్స్ ఈవెంట్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధాని నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం, వారిలో స్ట్రెస్ తగ్గించి కాన్ఫిడెన్స్ నింపడం.. ఆయనను ఈ తరానికి మరింత చేరువ చేసింది. దేశం ఒక గ్లోబల్ లీడర్ చేతుల్లో సురక్షితంగా ఉందనే భరోసా వీరికి దక్కుతోంది.

మిల్లెనియల్ పేరెంటింగ్ మరియు గేమిఫైడ్ మైండ్‌సెట్
జెన్ ఆల్ఫా ఆలోచనల వెనుక వారి ‘మిల్లెనియల్’ తల్లిదండ్రుల పెంపకం ఎంతో ఉంది. ఓపెన్ డిస్కషన్స్ గతంలో కుటుంబాల్లో పాలిటిక్స్ పట్ల ఒకరకమైన ఉదాసీనత ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఓపెన్ మైండ్‌తో దేశ ప్రగతి, సాంస్కృతిక వారసత్వం, రామమందిరం లాంటివి, అంతర్జాతీయ ఖ్యాతి గురించి పిల్లలతో చర్చిస్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ తో ఈ తరం పిల్లలు సమస్యలను ఒక ‘గేమ్’ లా చూస్తూ, ఇతరులతో కలిసి పరిష్కారాలు వెతుకుతారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ లాంటి కార్యక్రమాలు వీరి ఆలోచనా విధానానికి పర్ఫెక్ట్‌గా సింక్ అవుతున్నాయి. 2047 ద అల్టిమేట్ ఫ్లెక్స్ అనుకోవచ్చు. ప్రధాని మోదీ లీడర్ షిప్ లో భారత్ ‘2047 నాటికి వికసిత్ భారత్’ గా మారాలనే విజన్‌తో ముందుకు వెళుతోంది. ఈ విజన్ సాకారమయ్యే నాటికి ఈ జెన్ ఆల్ఫా పిల్లలు మిగిలిన తరాలతో దేశాన్ని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ అవుతారు.

బ్లైండ్ గా వ్యతిరేకించడం కంటే, దేశ పురోగతినే విజయానికి మెజరింగ్ గా తీసుకునే వాతావరణం ఇప్పుడు నెలకొంది. టెక్నాలజీ ని, జాతీయవాదాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. చిన్న వయసులోనే ఒక ప్రభుత్వానికి డిజిటల్ మాధ్యమాల ద్వారా మద్దతుగా నిలవడం కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ కాదు.. ఫ్యూచర్ ఇండియా వేయబోతున్న ఒక సాలిడ్ ఫౌండేషన్! “ఇది పాలిటిక్స్ ను మించిన ఒక గొప్ప జాతీయవాద జాగృతి.”
(శివకుమార్ గనివాడ, సీనియర్ సోషల్ అనలిస్ట్)