Mahaa Daily Exclusive

  నకిలీ మందులు.. నార్కోటిక్‌ మత్తు సిక్కర్ల పట్టివేత..

Share

  • రూ. 6.91 లక్షల విలువ చేసే నకిలీ మందుల స్వాధీనం
  • డ్రగ్‌ కంట్రోల్‌, ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ సంయుక్తంగా దాడి

 

హైదరాబాద్, మహా : సుద్ద ముక్కలు, బియ్యం పిండి కలిపి తయారు చేసిన నకిలీ యాంటి బాటిక్స్‌ను ఉత్తరఖాండ్‌తో తయారు చేసి కరీంనగర్‌, కర్నూల్‌లో అమ్మకాలు జరపడానికి దిగుమతి అయిన మందులను డ్రగ్స్‌ కంట్రోల్‌, ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌లు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. శుక్రవారం వచ్చిన పక్కా సమాచారం మేరకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎక్సైజ్‌ ఎస్టిఎఫ్ టీమ్‌ పోలీసులు కలిసి బాలనగర్‌ లోని తిరుపతి కొరియర్‌కు వచ్చిన యాంటి బాటిక్‌ మందులను, సిక్కరు అంటించుకుంటే చాలు మత్తు కలిగించే నార్కోటిక్‌ మందు లను పట్టుకున్నారు. పట్టుకున్న నకిలీ మందుల విలువ రూ. 6.91 లక్షలు ఉంటుందని అంచనాలు వేశారు.

 

ఉత్తరఖాండ్‌లో మహేష్‌ కుమార్‌ షైనీ అనే వ్యక్తి తన కంపెనీలో ఎలాంటి యాంటిబాటిక్స్‌ మందుల్లో వినియోగించే రసాయన పదార్థాలు లేకుండా తయారు చేసిన మందులను ముని శేఖర్‌, గండ్ర రాములు అనే వ్యక్తులు హైదరాబాద్‌కు తెప్పించారు. ఈ మందులను కరీంనగర్‌, కర్నూల్‌ జిల్లా కేంద్రాంలో మందుల దుకాణాలకు సరపరా చేయడానికి దిగుమతి చేసుకున్నారు.

 

నకిలీ యాంటిబాటిక్స్‌ను పట్టుకున్న వారిలో డ్రగ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్ డైరెక్టర్‌ పస్రాద్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, మల్కక్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, లక్ష్మణ్‌, గోవింద్‌ సింగ్‌, అనిల్‌రెడ్డిలు ఉన్నారు. ఎక్సైజ్‌ ‌ ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు సిబ్బంది ఉన్నారు.

 

ఒకేసారి నకిలీ యాంటిబాటిక్స్‌ను, మత్తు పదార్ధలను పట్టుకున్న డ్రగ్‌ ఇస్పెక్టర్లను, ఎస్ టి ఎఫ్ సిబ్బంది డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌, ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.