Mahaa Daily Exclusive

  తెలంగాణ సుభిక్షంగా ఉండాలి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్..! సీఎంతో కలసి పూజల్లో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే

Share

  • మహా వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  • సీఎంతో కలసి పూజల్లో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే

కారేపల్లి, మహ:వర్షాలు కురిసి జలాశయాలు సమృద్ధిగా నిండి పాడి పంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్వహించిన మహా వరుణ యాగంలో వైరా ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందజేసి సీఎంతో కలిసి వరుణ యాగం పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుతూ చేపట్టిన పథకాలన్నీ అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. వరుణ దేవుడు కూడా కరుణించి తెలంగాణ అభివృద్ధికి ఆశీస్సులు ఇవ్వాలని దానిలో భాగంగానే మహాయాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని పూజలు చేశారని చెప్పారు. తాను కూడా యాగంలో పాల్గొని రైతన్న లను అన్ని విధాల ఆదుకునేలా వరుణ దేవుడు నిండుగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నానని తెలిపారు. వైరా నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Latest